మాస్ మహా రాజా రవితేజ ‘క్రాక్’ సినిమా సూపర్ హిట్ అయింది. ప్రస్తుతం రమేష్ వర్మ ఖిలాడీ చేస్తున్నాడు. దీని తరువాత ఏ సినిమా చేయాలి ? ఏ డైరెక్టర్ తో చేయాలి అనే మీమాంసలో గత కొన్ని రోజులుగా రవితేజ సతమతమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రవితేజ డేట్స్ కోసం త్రినాధ్ రావ్ ఎదురుచూస్తున్నారు. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం తన తరువాత సినిమాని రవితేజ, నక్కిన త్రినాధ్ రావ్ తో చేయటానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు. కాగా ఈ వార్తకు సంబంధించి ఇంకా అధికారిక ప్రకటన రాకపోయినా.. దాదాపు మార్చి నుండి ఈ సినిమానే రవితేజ ముందు మొదలుపెట్టబోతున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే స్క్రిప్ట్ కూడా రెడీగా ఉండటం.. పైగా ఫుల్ ఎంటర్ టైనర్ కావడంతో ఈ సినిమా పై రవితేజ ఆసక్తిగా ఉన్నాడు. రవితేజ గోపిచంద్ మలినేని దర్శకత్వంలో చేసిన ‘క్రాక్’ సినిమాతో రవితేజకు పూర్వవైభవం వచ్చింది. ఇక రవితేజ కామెడీ టైమింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కేవలం తన మాడ్యులేషన్ తోనే అద్భుతమైన కామెడీని పండించగలడు. రవితేజ అలాంటి కామెడీ సినిమాతోనే ఈ సారి త్రినాథరావ్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.


