అఖిల్ సరసన యుంగ్ బ్యూటీ ?

అఖిల్ సరసన యుంగ్ బ్యూటీ ?

Published on Feb 7, 2021 11:00 PM IST

Krithi Shetty

యుంగ్ బ్యూటీ కృతి శెట్టి టాలీవుడ్ లో ఉప్పెన సినిమా‌తో ఎంట్రీ ఇవ్వనుంది. అయితే ఈ సినిమా రిలీజ్ కాకముందే నాని సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఆలాగే ఫామ్ లో ఉన్న యంగ్ హీరోల స‌ర‌స‌న వ‌ర‌స‌గా అవ‌కాశాలు వస్తున్నాయని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం ఈ బ్యూటీకి అక్కినేని అఖిల్ సరసన హీరోయిన్ గా అవకాశం వచ్చిందని తెలుస్తోంది.

అలాగే నాగశౌర్య హీరోగా రాబోయే ఓ చిత్రంలో ఈ భామను హీరోయిన్ గా తీసుకోబోతున్నారట. మరి ఈ రెండు సినిమాల్లో తన నటనతో ఆమె మెప్పించగలిగితే మాత్రం అవకాశాలు కృతి శెట్టికి ఇంకా పెరగడం ఖాయం. అలాగే తాజాగా సూర్య – హరి కలయికలో రాబోతున్న యాక్షన్ డ్రామాలో కూడా కృతి శెట్టికి హీరోయిన్ గా అవకాశం వచ్చిందని రూమర్స్ ఉన్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు గాని, మొదటి సినిమా రిలీజ్ కాకుండానే కృతి శెట్టికి ఓ రేంజ్ లో అవకాశాలు వస్తున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు