పవన్ సినిమాకు సడన్ గా ఈ ప్రమోషన్స్ ఏంటో..?

పవన్ సినిమాకు సడన్ గా ఈ ప్రమోషన్స్ ఏంటో..?

Published on Feb 9, 2021 7:04 AM IST

vakeel saab

ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా శృతి హాసన్ హీరోయిన్ గా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో తెరకెక్కించిన లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” విడుదలకు రెడీగా ఉన్న సంగతి తెలిసిందే. మరి ఇక్కడ నుంచి వరుస అప్డేట్స్ తో పవన్ మినహా చిత్ర యూనిట్ కూడా ప్రమోషన్స్ తో హోరెత్తించనుంది. అయితే ఇప్పుడు ఈ చిత్రానికి వారి కన్నా వేరే రకపు ప్రమోషన్స్ మొదలు అయ్యాయి.

ఇవి చూసి ఒకింత పవన్ అభిమానులే ఆశ్చర్యానికి లోనవుతున్నారు. ఇంతకీ అదేమిటంటే ఈ సినిమాను పలువురు ఉత్తరాది బీజేపీ నాయకులు కూడా ప్రమోట్ చేస్తున్నారు ఈ సినిమా భారీ హిట్ అవుతుందని వగైరా వగైరా అంటున్నారు. ఇంతకు ముందు ఎప్పుడు లేనిది పవన్ సినిమాకు ఇప్పుడు ఈ టైప్ ప్రమోషన్ జరగడం ఒకింత ఆశ్చర్యంగానే ఉంది. మరి దీని వెనుక ఆంతర్యం ఏమిటో తెలియాలి. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా దిల్ రాజు నిర్మాణం వహించిన సంగతి తెలిసిందే.

https://twitter.com/AmitAgarwal9/status/1358801666661707777?s=19

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు