
పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటిల కాంబినేషన్లో సాగర్ కె చంద్ర దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. మలయాళ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’కు ఇది తెలుగు రీమేక్. నిర్మాత సూర్యదేవర నాగవంశీ సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం:12గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. షూటింగ్ గత నెలలోనే మొదలైంది. పవన్ ఈ ప్రాజెక్టును చాలా వేగంగా సెట్ చేసుకోవడంతో అభిమానుల్లో మంచి అంచనాలు నెలకొన్నాయి.
ప్రజెంట్ ఈ సినిమా గురించిన ఒక ఆసక్తికరమైన వార్త ఫిల్మ్ నగర్లో చక్కర్లు కొడుతోంది. అదేమిటంటే ఇందులో స్టార్ డైరెక్టర్ ఒకరు చిన్న పాత్రను చేయనున్నారని. ఆ దర్శకుడు మరెవరో కాదు వి.వి.వినాయక్ అంటున్నారు. వినాయక్ కు నటన మీద ఆసక్తి ఉంది. ఈమధ్య హీరోగా ఒక సినిమా చేసే ప్రయత్నం కూడ చేశారు. ఆ ఆసక్తితోనే ఆయన పవన్ సినిమాలో అతిథి పాత్ర చేయడానికి అంగీకరించి ఉండవచ్చు. మరి ఈ వార్తలో ఎంతమాత్రం నిజముందో తెలియాలంటే చిత్ర బృందం నుండి అధికారిక కన్ఫర్మేషన్ వచ్చే వరకు ఆగాలి. సముద్రఖని, మురళీశర్మ, బ్రహ్మాజీ లాంటి స్టార్ నటులు ఇందులో నటిస్తున్నారు. థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి నవీన్ నూలి ఎడిటర్ కాగా ప్రసాద్ మూరెళ్ల సినిమాటోగ్రఫీ చేస్తున్నారు. స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, మాటలు అందిస్తుండటం విశేషం.

