“ఉప్పెన” ఈ మైల్ స్టోన్ ను కూడా అందుకుంటుందా?

“ఉప్పెన” ఈ మైల్ స్టోన్ ను కూడా అందుకుంటుందా?

Published on Feb 16, 2021 10:00 AM IST

Uppena 4

వైష్ణవ్ తేజ్ హీరోగా కృతి శెట్టి హీరోయిన్ గా బుచ్చిబాబు సానా దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం “ఉప్పెన”. గత వారం విడుదల కాబడిన ఈ డెబ్యూ చిత్రం బాక్సాఫీస్ దగ్గర నెవర్ బిఫోర్ ఫిగర్స్ ను సెట్ చేస్తూ వస్తుంది.వీక్ డే అయిన నిన్న సోమవారం కూడా స్ట్రాంగ్ ఆక్యుపెన్సీను ఈ చిత్రం రాబట్టినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

దీనితో ఈ చిత్రం క్లియర్ కట్ ఆడియెన్స్ సూపర్ హిట్టని మరోసారి కన్ఫర్మ్ అయ్యింది. అయితే ఈ చిత్రంతో ఏ డెబ్యూ హీరో సినిమాకు కూడా రాని వసూళ్లు వస్తున్నాయని క్లారిటీ వచ్చేసింది. దీనితో ఇదే ఊపులో మరో మైల్ స్టోన్ ను ఈ చిత్రం అందుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

ఈ చిత్రం ఇప్పటికే 50 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుంది. దీనితో నెక్స్ట్ స్టాప్ 60 కోట్లే అని తెలుస్తుంది. లాంగ్ రన్ లో ఈ మార్క్ ను కూడా కొడితే ఓ డెబ్యూ చిత్రంగా హీరో, హీరోయిన్ అలాగే డైరెక్టర్ కు ఇది ఒక సెన్సేషనల్ మైల్ స్టోన్ అనే చెప్పాలి. మరి లాంగ్ రన్ లో ఈ చిత్రం ఎక్కడ ఆగుతుందో చూడాలి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు