
ఎనర్జిటిక్ స్టార్ రామ్ హీరోగా నటించిన భారీ హిట్ చిత్రం “ఇస్మార్ట్ శంకర్” సినిమాతో మన టాలీవుడ్ యూత్ లో ఓవర్ నైట్ స్టార్డం తెచ్చుకున్న హాట్ అండ్ యంగ్ బ్యూటీ నిధి అగర్వాల్. అయితే నిధి పలు చిత్రాలతో మంచి గ్లామరస్ రోల్స్ లో కనిపించి ఆకట్టుకుంది. కానీ నిధి ఒక్క గ్లామర్ తోనే కాకుండా ఇప్పుడు తన హార్ట్ తో కూడా ఇంప్రెస్ చేసింది.
ప్రస్తుతం నెలకొన్న కరోనా పరిస్థితుల రీత్యా కష్టాలతో ఉన్న వారి కోసం డిస్ట్రిబ్యూట్ లవ్ అనే ఒక చారిటబుల్ ఆర్గనైజేషన్ ను స్టార్ట్ చేసిందట. దీనితో పలు విధాలుగా ఈ కష్ట కాలంలో ఇబ్బందులు పడుతున్న వారికి సహకారం అందించనుంది. దీనితో నిధి అగర్వాల్ తీసుకున్న ఈ నిర్ణయానికి సినీ వర్గాల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా నిధి ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న భారీ పాన్ ఇండియన్ చిత్రం “హరిహర వీరమల్లు” లో హీరోయిన్ గా నటిస్తుంది.

