ఎలాంటి అతి లేదు.. ‘రాకా’తో గ్లోబల్ స్టాండర్డ్స్ సెట్ చేస్తున్నాం – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

ఎలాంటి అతి లేదు.. ‘రాకా’తో గ్లోబల్ స్టాండర్డ్స్ సెట్ చేస్తున్నాం – ఐకాన్ స్టార్ అల్లు అర్జున్

Published on Sep 24, 2026 2:05 AM IST

QAlllAllu-Arjun

ఇప్పుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా దర్శకుడు అట్లీతో చేస్తున్న గ్రాండ్ విజువల్ ట్రీట్ డ్రామానే ‘రాకా’. రీసెంట్ గానే గిన్నిస్ వరల్డ్ రికార్డు కూడా సాధించిన ఈ సినిమా ఆల్రెడీ గ్లోబల్ ఆడియెన్స్ లోకి ఇంజెక్ట్ అవుతూ వెళుతుంది. ఇక ఇదిలా ఉండగా మేకర్స్ ఆ రికార్డు కోసం కూడా ఏర్పాటు చేసిన మీటింగ్ ని స్ట్రీమింగ్ కి తీసుకొచ్చారు.

ఇక ఇందులో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇచ్చిన స్టేట్మెంట్ వైరల్ గా మారింది. రాకా విషయంలో ఏ రేంజ్ లో తాను కాన్ఫిడెంట్ గా ఉన్నాడంటే ఖచ్చితంగా గ్లోబల్ స్టాండర్డ్స్ లో ఈ సినిమా ఉండబోతుంది అని ప్రామిస్ చేస్తున్నాడు. ఎలాంటి అతిశయోక్తి లేదు..

ఒక కొత్త బెంచ్ మార్క్ సెట్ చేసే విధంగా రాకా చేస్తున్నాం, ఇది ఇండియన్ స్టాండర్డ్స్ కాదు గ్లోబల్ మార్క్ చేస్తున్నామని కాన్ఫిడెంట్ గా తెలిపాడు. దీనితో రాకా విషయంలో అభిమానులు మరింత ఎగ్జైట్ అవుతున్నారు. ఇక తన ఫ్యాన్స్ కి కూడా కొంచెం ఓపిక పట్టమని కూడా సూచించాడు. దీనితో తన కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

తాజా వార్తలు