‘రాధేశ్యామ్’ ఓటీటీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా ?

‘రాధేశ్యామ్’ ఓటీటీ ప్లాన్ వర్కవుట్ అవుతుందా ?

Published on Jun 4, 2021 4:02 AM IST

Radhe Shyam1

లాక్ డౌన్ మూలంగా చాలా పెద్ద సినిమాల విడుదలకు అడ్డంకులు ఏర్పడ్డాయి. అలా అడ్డంకులు ఎదుర్కొంటున్న సినిమాల్లో ప్రభాస్ ‘రాధేశ్యామ్’ కూడ ఒకటి. ఇప్పటికే ఈ సినిమా చాలా ఆలస్యం అయింది. ఇంకా కొద్దిగా షూటింగ్ బ్యాలెన్స్ ఉండనే ఉంది. లాక్ డౌన్ నిబంధనలు సడలిపోయాక చిత్రీకరణ రీస్టార్ట్ చేయనున్నారు. అయితే విడుదల విషయంలోనే కన్ఫ్యూజన్ నెలకొంది. ఈ ఏడాదిలోనే రిలీజ్ అనుకుంటున్నారు కానీ ఇప్పుడు అనేది క్లారిటీ లేదు. కరోనా ఎఫెక్ట్ పూర్తిగా తగ్గి సినిమా హాళ్లు వంద శాతం ఓపెన్ అయితేనే పెద్ద సినిమాలకు లాభదాయకం.

అలా కాకుండా అరకొర సినిమా హాళ్లలో, 50 శాతం ఆక్యుపెన్సితో అంటే అస్సలు కుదరదు. అందుకే కొందరు ఓటీటీతో పాటు ఉన్న కొద్దిపాటి థియేటర్లలో ఒకేసారి సినిమా రిలీజ్ చేసే ప్లాన్స్ పెట్టుకుంటున్నారు. ఇటీవల సల్మాన్ ఖాన్ ‘రాధే’ కూడ ఇదే తరహాలో విడుదలైంది. అయితే లాభాల సంగతేమిటనే విషయాలు తెలీలేదు. ఇప్పుడు ‘రాధేశ్యామ్’ కూడ ఇదే తరహా విడుదలకు వెళ్తోందనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అయితే కేవలం ఓటీటీ ద్వారా సినిమా రిలీజ్ చేస్తే అభిమానులు డిసప్పాయింట్ అవ్వడమే కాదు నిర్మాతలు సైతం ఆశించిన ఫలితాల్ని చూడలేరు. ‘రాధేశ్యామ్’ లాంటి భారీ సినిమాల విషయంలో ఈ తరహా ప్లాన్స్ అస్సలు వర్కవుట్ కావు. అందుకే ‘రాధేశ్యామ్’ నిర్మాతలు, ప్రభాస్ కూడ ఓటీటీ విడుదలకు ససేమిరా అంటున్నారట.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు