విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ఓటీటీ డేట్ ఇదేనా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

విశ్వక్ సేన్ ‘ఫంకీ’ ఓటీటీ డేట్ ఇదేనా.. స్ట్రీమింగ్ ఎందులో అంటే..?

Published on Mar 3, 2026 6:00 PM IST

Funky

మాస్ కా దాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్ చిత్రం ‘ఫంకీ’ ఇటీవల రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ దగ్గర ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిల్ అయింది. ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 13న ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. దర్శకుడు కె.వి.అనుదీప్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా కామెడీ ఎంటర్‌టైనర్ ప్రేక్షకుల అంచనాలు అందుకోవడంలో వెనకబడిపోయింది.

ఇక ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్ర డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ మంచి ఫ్యాన్సీ రేటుకు దక్కించుకుంది. దీంతో ఈ చిత్రాన్ని మార్చి 13 నుంచి ఓటీటీ స్ట్రీమింగ్ చేసేందుకు నెట్‌ఫ్లిక్స్ రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.

ఈ సినిమాలో అందాల భామ కయాదు లోహర్ హీరోయిన్‌గా నటించగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్ పై ఈ చిత్రాన్ని నాగవంశీ ప్రొడ్యూస్ చేశారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు