హీరో మంచు మనోజ్ ప్రస్తుతం చేస్తోన్న కొత్త సినిమా ‘అహం బ్రహ్మాస్మి’. అయితే ఈ సినిమా కోసం వర్కౌట్స్ చేస్తున్నాడు. ఈ లాక్ డౌన్ లో ఈ సినిమాలో కనిపించే కొత్త లుక్ కోసం కసరత్తులు చేశాడు. తన ఫిజిక్ ను పూర్తిగా మార్చడానికి కఠినమైన వర్కవుట్ లు చేసి, మనోజ్ దాదాపు 10 కిలోల బరువు తగ్గాడట. ఇక ఎప్పుడూ కొత్తదనం కోసం వైవిధ్యమైన కథలతో సినిమాలు చేస్తాడు మనోజ్.
కాగా ఈ సారి కూడా ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ తో.. ‘అహం బ్రహ్మాస్మి’ అనే గొప్ప స్లోగన్ ఆధారంగా నడిచే కథతో పవర్ ఫుల్ రీఎంట్రీ ఇస్తున్నాడు. ఇక ఇండస్ట్రీలో కొత్త టాలెంట్ ను ఎంకరేజ్ చేయాలని ‘ఎమ్ఎమ్ ఆర్ట్స్’ పేరుతో మంచు మనోజ్ సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు. దర్శకుడు శ్రీకాంత్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా ఎమ్ ఎమ్ ఆర్ట్స్ పతాకం పై మంచు ఫ్యామిలీ స్వయంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.


