వరల్డ్ టెలివిజన్ హిస్టరీలోనే బిగ్గెస్ట్ రియాలిటీ షో ఏదన్నా ఉంది అంటే అది బిగ్ బాస్ షో అని తెలిసిందే. అలాగే మన ఇండియన్ టెలివిజన్ దగ్గర కూడా బిగ్ బాస్ షో కి విపరీతమైన క్రేజ్ ఉంది. అయితే మన దగ్గర మాత్రం తెలుగు సీజన్లకు వచ్చే రెస్పాన్స్ మాత్రం వేరే లెవెల్.. అందుకే ఈ గ్రాండ్ రియాలిటీ షో కోసం పెద్ద ఎత్తున ఆడియెన్స్ ఎదురు చూస్తారు.
మరి ఇప్పటి వరకు నాలుగు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ షో ఐదో సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందా అని స్మాల్ స్క్రీన్ వీక్షకులు వెయిట్ చేస్తున్నారు. అయితే ఈ స్టార్టింగ్ డేట్ పై ఇప్పటికే పలు గాసిప్స్ ఉన్నాయి. మరి ఇప్పుడు మరో డేట్ దీనిపై వినిపిస్తుంది. వచ్చే సెప్టెంబర్ 5 నాటికి ఈ షో అవుతుందేమో అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరి అలాగే ఇంతకు ముందు అక్టోబర్ కి ఈ షో షిఫ్ట్ అయ్యిందని కూడా టాక్ వచ్చింది. మరి ఏ సమయానికి ఈ షో మొదలు కానుందో కాలమే నిర్ణయించాలి.


