విడాకుల పై అమీర్ – కిరణ్ తాజా వివరణ !

విడాకుల పై అమీర్ – కిరణ్ తాజా వివరణ !

Published on Jul 5, 2021 3:00 AM IST

Aamir Khan

బాలీవుడ్‌ మిస్టర్‌ పర్ఫెక్ట్‌ ఆమిర్‌ఖాన్‌ – కిరణ్‌రావు దంపతులు విడాకులకు సంబంధించి అమీర్ పై సీరియస్ అవుతున్నారు నెటిజన్లు. ముఖ్యంగా నెగిటివ్ కామెంట్స్ చేస్తూ… ఈ హాట్‌ టాపిక్‌ పై సెటైర్లు, ట్రోలింగ్‌ తో తెగ హడావిడి చేస్తున్నారు. ఈ ట్రోల్‌ పై ఆమిర్‌, కిరణ్‌ రావు సంయుక్తంగా ఓ వీడియో విడుదల చేశారు.

ఈ వీడియోలో అమీర్ మాట్లాడుతూ ‘మేము భార్యాభర్తలుగా విడిపోయినా ఒకరి ఒకరం తోడుగా ఉంటాం. ఎప్పటికీ మాది ఒకటే కుటుంబం. ‘మా విడాకులు వార్త విని అభిమానులంతా షాక్‌ అయ్యారు. కానీ మా నిర్ణయంతో మేమీద్దరం చాలా సంతోషంగా ఉన్నామని మీ అందరికీ చెప్పాలనుకుంటున్నాం. మా సంబంధంలో మార్పు వచ్చింది కానీ ఎప్పటికీ ఒకరికి ఒకరం తోడుగా ఉంటాం’ అని అమీర్ చెప్పుకొచ్చాడు.

ఇక ‘మా కుమారుడు ఆజాద్‌ బాధ్యతను, పానీ ఫౌండేషన్‌ బాధ్యతలను ఇద్దరం కలిసి చూసి తీసుకుంటామని కిరణ్‌రావు చెప్పుకొచ్చింది.

వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు