యంగ్ టాలెంటెడ్ సందీప్ పైడిమర్రి దర్శకుడిగా పరిచయమవుతూ రూపొందిస్తున్న మర్డర్ మిస్టరీ సస్పెన్స్ థ్రిల్లర్ కథాచిత్రం ‘కేస్-30’. పి.ఎన్.ఆర్.ఫిల్మ్ ఫ్యాక్టరీ-యువసాయి క్రియేషన్స్ బ్యానర్స్‌పై పి.నరసింహారావు మరియు బోడా రాధాకృష్ణ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సిద్ధార్ద్ నాయుడు, షామిలి యూనియల్ ప్రధాన పాత్రల్లో నటించారు.
అయితే ఈ సినిమా టీజర్‌ను సెప్టెంబర్ 10న రిలీజ్ చేయబోతున్నట్టు చిత్ర బృందం ప్రెస్ మీట్ ద్వారా అనౌన్స్ చేసింది. అంతేకాదు అక్టోబర్‌లో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టు కూడా తెలిపారు. కాగా ఈ సినిమా స్టోరీనీ స్వయంగా సిద్ధార్థ్ నాయుడే రాయడం విశేషం.


