బాలీవుడ్ లో ఉన్నటువంటి బిగ్గెస్ట్ యాక్షన్ ఫ్రాంచైజ్ లో యశ్ రాజ్ ఫిలిమ్స్ వారి నిర్మాణ సంస్థ నుంచి వస్తున్న స్పై యూనివర్స్ కూడా ఒకటి. గత ఏడాది వీరి నుంచి వచ్చిన సినిమానే “వార్ 2”. ఇక ఆ సినిమా తర్వాత వారి నుంచి రావాల్సి ఉన్న సినిమానే “ఆల్ఫా”. స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో ఈ స్పై యూనివర్స్ లో మొదటి ఫీమేల్ సెంట్రిక్ సినిమాగా దీనిని ప్లాన్ చేశారు.
అయితే ఈ సినిమా ఇది వరకే విడుదల కావాల్సి ఉంది కాని మేకర్స్ వాయిదా వేశారు. ఇప్పుడు ఫైనల్ గా ఈ సినిమా డేట్ ని మేకర్స్ అనౌన్స్ చేసేసారు. దీనితో ఈ సినిమా ఈ ఏడాది జూలై 10న గ్రాండ్ గా రిలీజ్ కి తీసుకొస్తున్నట్టు ఖరారు చేసారు. మరి ఈ సినిమా అయినా అనుకున్న రేంజ్ హిట్ అవుతుందో లేదో చూడాలి. ఇక ఆ చిత్రంలో బాబీ డియోల్ విలన్ గా నటిస్తుండగా శర్వరి, అనీల్ కపూర్ తదితరులు నటిస్తున్నారు.
#ALPHA 10.07.2026 pic.twitter.com/qhUWGanyge
— Yash Raj Films (@yrf) March 9, 2026


