
సురేష్ నీలి ప్రొడక్షన్‌లో సాయిరామ్ దాసరి దర్శకత్వం లో తెరకెక్కుతున్న చిత్రం దేవుడితో సహజీవనం. ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్‌ను మరియు గ్లింప్స్ తాజాగా విడుదల చేయడం జరిగింది. దర్శకుడు రవిబాబు పంది సినిమాను ప్రమోషన్ లో పందిచే విడుదల చేయించినట్టు, ఈ సాయిరామ్ దాసరి కూడా కుక్క చే దేవుడితో సహజీవనం ఫస్ట్ లుక్ మరియు గ్లింప్స్ ను విడుదల చేయించారు. ఈ చిత్రంలో హర్ష నీలవెళ్లి, విక్రమ్, సింధు, హైమ, మధు, సుమిత్ లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా దర్శకుడు సాయిరామ్ దాసరి మాట్లాడుతూ, దేవుడితో సహజీవనం చిత్రంలో కుక్క ప్రధాన పాత్ర పోషిస్తోంది. అందుకే ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను కుక్కచే విడుదల చేయించడం జరిగింది అని తెలిపారు. విక్రాంత్ దేవుడి పాత్రలో నటిస్తున్నారు.

