ఇండియా కంటే ముందుగా అమెరికాలో విడుదలవుతున్న బాడీగార్డ్

ఇండియా కంటే ముందుగా అమెరికాలో విడుదలవుతున్న బాడీగార్డ్

Published on Dec 14, 2011 11:49 AM IST

Bodyguard audio2
బహుశ ఒక తెలుగు అగ్ర హీరో సినిమా ఇండియాలో కంటే ముందుగా అమెరికాలో విడుదల కాబోతుంది. విక్టరీ వెంకటేష్ నటించిన ‘బాడీగార్డ్’ చ్గిత్రం జనవరి 9న విడుదలకు సిద్ధమవుతుంది. ఇదే చిత్రం ఇండియాలో మాత్రం 12న విడుదల కాబోతుంది. ఈ విషయాన్ని నిర్మాత బెల్లంకొండ సురేష్ నిన్న జరిగిన బాడీగార్డ్ ఆడియో ఫంక్షన్ లో తెలిపారు. ఈ చిత్ర ఆడియో ఆల్బం నిన్న జరిగిన శిల్ప కల వేదికలో విడుదల చేసారు. ఈ వేడుకకు ఈ చిత్ర యూనిట్ తో పాటుగా డాక్టర్ డి. రామానాయుడు, ప్రభాస్, రానా. కార్తి, వివి వినాయక్ మరియు దిల్ రాజు హాజరయ్యారు. గోపీచంద్ మలినేని దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి బెల్లంకొండ సురేష్ నిర్మాత.

తాజా వార్తలు