న్యాచురల్ స్టార్ నాని, దర్శకుడు శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్‌లో ‘దసరా’ వంటి భారీ విజయం తర్వాత వస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘ది ప్యారడైజ్’. ఈ చిత్ర షూటింగ్ చివరి దశకు చేరుకుంది. ఇక ఈ సినిమాతో మరోసారి నానిని రఫ్ అండ్ రగడ్ లుక్‌లో చూపించబోతున్నాడు శ్రీకాంత్ ఓదెల. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్స్, సాంగ్ ఈ సినిమాపై అంచనాలు పెంచాయి.
ఇక ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను ఆగస్టు 6న రిలీజ్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే వెల్లడించింది. తాజాగా ఈ సినిమా నుంచి నాని ‘జడల్’ పాత్రకు సంబంధించి ఓ పవర్‌ఫుల్ స్టిల్ రిలీజ్ చేశారు. బాక్సింగ్ బ్యాగ్‌ను జడల్ సాలిడ్‌గా పంచ్ కొడుతున్న ఈ పిక్‌తో అభిమానుల్లో మరోసారి ఈ సినిమాపై అంచనాలు పెంచారు.
ఇక ఈ సినిమాలో కయాదు లోహర్ హీరోయిన్‌గా నటిస్తుండగా కీర్తి సురేష్ ఓ స్పెషల్ సాంగ్‌లో మెరవనుంది. రాఘవ్ జుయాల్, మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రాన్ని ఎస్ఎల్‌వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి ప్రొడ్యూస్ చేస్తున్నారు.


