
టాలీవుడ్ స్టార్ హీరో, నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో, డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి. ఈ చిత్రం లో కాజల్ అగర్వాల్ తో పాటుగా, యంగ్ బ్యూటీ శ్రీ లీల కీలక పాత్రలో నటిస్తుంది. నేడు శ్రీ లీల పుట్టిన రోజు సందర్భంగా మేకర్స్ బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు.
శ్రీ లీల ఫస్ట్ లుక్ విశేషం గా ఆకట్టుకుంటుంది. ఈ చిత్రం నుండి విడుదల అయిన టీజర్ కి ప్రేక్షకుల నుండి, అభిమానుల నుండి సూపర్ రెస్పాన్స్ వస్తోంది. బాలయ్య మాస్ టీజర్ తో ఆడియెన్స్ ను బాగా ఆకట్టుకున్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ చిత్రానికి మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నారు.

