‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూడో సాంగ్ పైనే ఫ్యాన్స్ కళ్ళు!

‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూడో సాంగ్ పైనే ఫ్యాన్స్ కళ్ళు!

Published on Mar 12, 2026 8:08 AM IST

Ustaad Bhagat Singh 2

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమానే ఉస్తాద్ భగత్ సింగ్. అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమా నుంచి ఒకో కంటెంట్ బయటకి వస్తుంది. ఇలా నేడు సినిమా తాలూకా మూడో సాంగ్ కాలరే ఎత్తరా విడుదల కానుండగా హైదరాబాద్ మైత్రి వాళ్ళ థియేటర్ విమల్ లో ఈ సాంగ్ ని మేకర్స్ గ్రాండ్ గా లాంచ్ చేయబోతున్నారు. అయితే ఈ సాంగ్ కోసమే ఇప్పుడు అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.

రీసెంట్ గా దర్శకుడు హరీష్ శంకర్ ఇదో భారీ సెట్ నడుమ చేసిన సాంగ్ అని తెలిపారు. పైగా పవన్ కి ప్రముఖ డాన్స్ మాస్టర్ దినేష్ మాస్టర్ కొరియోగ్రఫీ చేయడంతో అభిమానులు కూడ కొంచెం కొత్తగా ఆశిస్తున్నారు. ఇలా ఈ పాట కోసం కొంచెం పాజిటివ్ హోప్ లోనే అభిమానులు ఉన్నారు. మరి దాన్ని రీచ్ అవుతారా లేదా అనేది వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమాకి దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు అలాగే మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం వహిస్తున్న సంగతి తెలిసిందే.

తాజా వార్తలు