ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ఎమోషనల్ డ్రామా ‘నవాబ్ కేఫ్’

ఈ ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ఎమోషనల్ డ్రామా ‘నవాబ్ కేఫ్’

Published on Mar 12, 2026 9:07 AM IST

Nawab Cafe

ఇటీవల థియేటర్స్ లో రిలీజ్ కి వచ్చిన తెలుగు చిత్రాల్లో నవాబ్ కేఫ్ అనే చిన్న సినిమా కూడా ఒకటి. సీనియర్ నటుడు రాజీవ్ కనకాల, యువ నటుడు శివ కందుకూరి ప్రధాన పాత్రల్లో దర్శకుడు ప్రమోద్ హర్ష తెరకెక్కించిన ఈ ఎమోషనల్ డ్రామా థియేటర్స్ లో అనుకున్న రీతిలో ఆకట్టుకోలేకపోయింది.

కొన్ని ఎమోషన్స్ పరంగా కొంచెం ఓకే అనిపించినా ఓవరాల్ గా మాత్రం సినిమా ఆడియెన్స్ ని ఎంగేజ్ చెయ్యలేకపోయింది. ఇక ఫైనల్ గా ఈ సినిమా ఓటిటిలో విడుదలకి వచ్చింది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు మన తెలుగు ప్లాట్ ఫామ్ ఈటీవీ విన్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. వారు ఈ చిత్రాన్ని నేటి నుంచి అందుబాటులోకి తీసుకొచ్చేసారు. సో ఓటిటిలో ఈ చిత్రాన్ని చూడాలి అనుకునేవారు చూడొచ్చు. ఇక ఈ సినిమాకి కార్తీక్ రాజా సంగీతం అందించగా లక్ష్మి ప్రొడక్షన్స్ వారు నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు