నితిన్ “తమ్ముడు” లో ఈ బబ్లీ బ్యూటీ?

నితిన్ “తమ్ముడు” లో ఈ బబ్లీ బ్యూటీ?

Published on Sep 22, 2023 8:00 PM IST

Varsha Bollamma

టాలీవుడ్ హీరో నితిన్ ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. వాటిలో ఒకటి డైరెక్టర్ వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్న తమ్ముడు. వకీల్ సాబ్‌ చిత్రం తో ఈ డైరెక్టర్ కు సూపర్ క్రేజ్ ఏర్పడింది. ఈ చిత్రం తో ప్రశంసలు అందుకున్నారు. ఈ సినిమా మరోసారి వార్తల్లో నిలిచింది.

కథానాయికగా కాక మరో కీలక పాత్రలో వర్షా బొల్లమ్మ కీలక పాత్రలో నటిస్తుందని తాజా సమాచారం. ఆమె పాత్ర గురించి మేకర్స్ నుండి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాంతార చిత్రం తో గుర్తింపు పొందిన సప్తమి గౌడ ఈ చిత్ర కథానాయికగా ఎంపికైంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రం కి సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు