సెన్సార్ కంప్లీట్ చేసుకున్న “టైగర్ నాగేశ్వరరావు”..ఫైనల్ రన్ టైం ఇదే

సెన్సార్ కంప్లీట్ చేసుకున్న “టైగర్ నాగేశ్వరరావు”..ఫైనల్ రన్ టైం ఇదే

Published on Oct 18, 2023 11:00 AM IST

tiger 11
మాస్ మహారాజా రవితేజ హీరోగా నుపుర్ సనన్ మరియు గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్స్ గా దర్శకుడు వంశీ తెరకెక్కించిన భారీ పాన్ ఇండియా చిత్రం “టైగర్ నాగేశ్వరరావు” కోసం అందరికీ తెలిసిందే. మరి పాన్ ఇండియా లెవెల్లో మంచి ప్రమోషన్స్ నడుమ రిలీజ్ చేస్తున్న ఈ చిత్రం రవితేజ కెరీర్ లోనే మోస్ట్ అవైటెడ్ గా వస్తుండగా ఈ సినిమా అయితే ఇపుడు సెన్సార్ ని కంప్లీట్ చేసుకున్నట్టుగా మేకర్స్ కన్ఫర్మ్ చేశారు.

ఈ చిత్రానికి సెన్సార్ యూనిట్ వారు యూ/ఏ సర్టిఫికెట్ ని అందించారు. అలాగే ఈ చిత్రానికి గత కొన్ని రోజులు నుంచి వైరల్ అవుతున్న రన్ టైం కూడా అసలది కాదని తెలుస్తుంది. టైగర్ నాగేశ్వరరావు ఫైనల్ రన్ టైం గా బిగ్ స్క్రీన్స్ లో 2 గంటల 52 నిమిషాల రన్ టైం తో పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్నట్టుగా కన్ఫర్మ్ అయ్యింది. మొత్తానికి అయితే రవితేజ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్న ఈ చిత్రం గ్రాండ్ గా ఈ 20న రిలీజ్ కాబోతుంది.

తాజా వార్తలు