గ్లోబల్ మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా మావెరిక్ దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిస్తున్న భారీ పొలిటికల్ అండ్ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం “గేమ్ చేంజర్” కోసం అందరికీ తెలిసిందే. మరి ఈ చిత్రం షూటింగ్ ప్రస్తుతానికి ఆలా కొనసాగుతూ ఉండగా మేకర్స్ అయితే రీసెంట్ గానే ఈ సినిమాలో ఫస్ట్ సింగిల్ పై అప్డేట్ ఇవ్వడంతో దానిపై క్రేజీ హైప్ అయితే స్టార్ట్ అయ్యింది. మరి జస్ట్ ఆ పోస్టర్ తోనే సాంగ్ ఏ లెవెల్ గ్రాండ్ గా ఉంటుందో అర్ధం అయ్యిపోయింది.
ఇక శంకర్ తన సినిమాల్లో సాంగ్స్ అంటే ఒక డెడ్లి కాంబినేషన్. అదే విధంగా ఈ చిత్రంలో కూడా సాంగ్స్ కి చాలా ఖర్చు పెట్టామని నిర్మాత దిల్ రాజు అయితే రివీల్ చేశారు. మరి అలా ఈ సినిమాలో మొదటి సాంగ్ కి ఏకంగా 15 కోట్లకి పైగానే వెచ్చించారట. పోస్టర్ లో కనిపించిన ఇల్లు అవన్నీ సెట్టింగ్స్ వేయించి శంకర్ షూట్ చేసారని తెలుస్తుంది. అందుకే ఈ సాంగ్ కి ఆ రేంజ్ బడ్జెట్ అయ్యింది అని టాక్. మొత్తానికి అయితే గేమ్ చేంజర్ సాంగ్స్ ఒక్క బడ్జెట్ తోనే ఓ భారీ సినిమా తీసేయొచ్చు అని చెప్పవచ్చు.


