లేటెస్ట్..ఊహించని అనౌన్సమెంట్ ఇచ్చిన “కాంతార” మేకర్స్

లేటెస్ట్..ఊహించని అనౌన్సమెంట్ ఇచ్చిన “కాంతార” మేకర్స్

Published on Nov 25, 2023 10:00 AM IST

కన్నడ స్టార్ నటుడు రిషబ్ శెట్టి హీరోగా సప్తమి గౌడ హీరోయిన్ గా రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన రీసెంట్ చిత్రం “కాంతార”. మరి ఈ చిత్రం గత ఏడాది పాన్ ఇండియా లెవెల్లో ఓ డివోషనల్ హిట్ కాగా సుమారు 400 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకొని ఆ ఏడాది కన్నడ సినిమా దగ్గర బిగ్గెస్ట్ గ్రాసర్ చిత్రాల్లో ఒకటిగా నిలిచింది.

ఇక ఈ చిత్రంకి రిషబ్ ఓ ప్రీక్వెల్ ని కూడా అనౌన్స్ చేయడంతో మరిన్ని అంచనాలు నెలకొనగా ఇప్పుడు ఆకస్మికంగా మేకర్స్ ఓ సాలిడ్ అనౌన్సమెంట్ ని అందించారు. అప్పుడే ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అంటూ డేట్ మరియు టైం ని ఇప్పుడు లాక్ చేసేసారు.

ఈ నవంబర్ 27న మధ్యాహ్నం 12:25 నిమిషాలకి “కాంతార పార్ట్ 1” ఫస్ట్ లుక్ ని రిలీజ్ చేస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. పైగా ఈ అనౌన్సమెంట్ పోస్టర్ లో ఉన్న లైన్ మరింత ఆసక్తిగా “అది కేవలం వెలుగు మాత్రమే కాదు అది దర్శనం” అంటూ లైన్ పెట్టారు. దీనితో ఈ సినిమా ఇంకెత డివోషనల్ గా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు