సంయుక్త సమర్పణలో ఆలోచింపజేసే ‘కీప్ ది ఫైర్ అలైవ్’ షార్ట్ ఫిల్మ్

సంయుక్త సమర్పణలో ఆలోచింపజేసే ‘కీప్ ది ఫైర్ అలైవ్’ షార్ట్ ఫిల్మ్

Published on Mar 8, 2025 9:19 AM IST

Samyuktha

లైంగిక వేధింపులపై విప్లవాత్మకమైన వినూత్నమైన ప్రయత్నమే “కీప్ ది ఫైర్ అలైవ్” షార్ట్ ఫిల్మ్. ఇది 1 నిముషం 25 సెకండ్ల షార్ట్ ఫిల్మ్ మాత్రమే కాదు అందరిని ఆలోచింపజేసే అద్భుతమైన దృశ్యకావ్యం. యదార్థ సంఘటనలపై స్పృహ కల్పించి, రేపటి తరాన్ని మేలుకొల్పే సారాంశం. ఈ ప్రేక్షకసమాజం తనవైపు చూసి ఆలోచించే కంటెంట్ ఉంది కాబట్టే బ్యూటిఫుల్ హీరోయిన్ సంయుక్తను ఈ షార్ట్ ఫిల్మ్ ఆకర్షించింది. అందుకే కె.ప్రఫుల్ చంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్‌ను సంయుక్త ప్రెజెంట్ చేయడానికి ముందుకు వచ్చారు.

ఈ సందర్భంగా రచయిత దర్శకుడు కె.ప్రఫుల్ చంద్ర మాట్లాడుతూ..‘నిత్యం మన చుట్టూ జరిగే చాలా విషయాలు మన కోపానికి కారణం అవుతాయి. వాటిలో లైంగిక వేధింపులకు సంబంధించిన విషయాలు బాధతో పాటు కోపాన్ని కలిగిస్తాయి. వాటిని అధిగమించాలంటే కఠినమైన చట్టాలు తీసుకొస్తే సరిపోతుందా అంటే కచ్చితంగా కాదు. వీటి కన్నా స్పృహ అత్యంత ముఖ్యమైనది. మనందరం మనుషులం. ఎవరితో ఎలా ప్రవర్తించాలో మనకు తెలుసు. కానీ మారుతున్న కాలంతో పాటు మనం కొన్ని విలువలు మర్చిపోయాము. మళ్లీ మనుషులుగా మనమంతా ఒకే తాటిపై నిలబడితే ఎలాంటి అరాచకాలకు తావుండదు. కచ్చితంగా రేపటి కోసం ఒక అడుగు అందరమూ వేయాలి. అప్పుడే మార్పు మొదలవుతుంది. ఆ మార్పు ఫలాలు భవిష్యత్ తరాలు కచ్చితంగా అనుభవిస్తాయి. అనే పాయింట్ తో ఈ లఘు చిత్రాన్ని తెరకెక్కించాము.’ అని అన్నారు.

ఈ షార్ట్ ఫిలింకు సినిమాటోగ్రాఫర్ మౌర్య అద్భుతమైన ఫ్రేమ్స్ పెట్టారు. చేరుబ్ శిర్షత్ అందించిన సంగీతం ప్రతీ సన్నివేశానికి ప్రాణం పోసింది. గ్యారేజ్ స్టూడియోలో ఎడిటింగ్, విఎఫెఎక్స్ చేశారు. ఈ షార్ట్ ఫిలిం ఇంత అద్భుతంగా రూపుదిద్దుకోవడానికి షేక్ హాసన్, అంకిత్ సిద్ధార్థ, సఫా, వినోదుల కృషి ఎప్పటికీ మరువలేనిది అని దర్శకుడు అన్నారు.

అండర్ ది సేమ్ స్కై ప్రొడక్షన్ బ్యానర్ పై ఈ షార్ట్ ఫిల్మ్ తెరకెక్కించినట్లు చెప్పారు. అలాగే చరణ్ తేజ్ ఉప్పలపాటి, యష్ ఇద్దరికి కృతజ్ఞతలు చెప్పారు. ముఖ్యంగా చరణ్ తేజ్ ఉప్పలపాటి అందించిన సహకారం ఎప్పటికీ మరువలేనిది. ఇలాంటి ఈ గొప్ప ప్రయత్నానికి సంయుక్తతో రావడం అద్భుతం అని చెప్పవచ్చు. ఆమె వాయిస్ ఓవర్ లో ప్రతి పదం ఒక అగ్ని కణంలో ఉంటుందని ప్రేక్షకుడి హృదయానికి అంటుకుంటుందని చెప్పారు. ఈ షార్ట్ ఫిలిం మళ్లీ మళ్లీ చూసేలా సంయుక్త గొంతు మ్యాజిక్ చేసిందని చెప్పారు.

సంయుక్త కూడా ఆదిశక్తి అనే ఫౌండేషన్‌ను స్థాపించి మహిళా శక్తిని ప్రపంచానికి తెలియజేయాలనే సంకల్పంతో అడుగులు వేస్తోంది. అందుకే మా షార్ట్ ఫిలిం సంయుక్త హృదయానికి అత్యంత చేరమైంది. కచ్చితంగా అందరం కలిసి మార్పు కోసం ఒక అడుగు వేస్తే సమాజంలో స్త్రీలపై ఎలాంటి దాడులు జరగవు. మా షార్ట్ ఫిలిం కచ్చితంగా ఒక మేలుకొలుపు అని కె.ప్రఫుల్ చంద్ర అన్నారు.

తాజా వార్తలు