‘హరిహర వీరమల్లు’లో హైలైట్ సీన్ అదే !

‘హరిహర వీరమల్లు’లో హైలైట్ సీన్ అదే !

Published on Mar 9, 2025 7:44 PM IST

images
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ సినిమా షూటింగ్ ని తిరిగి స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా పై ఇప్పుడు ఓ క్రేజీ న్యూస్ వినిపిస్తోంది. ఈ సినిమాలో పవన్ కల్యాణ్ ఇంట్రో సీన్ అదిరిపోతుందని.. గజదొంగ పాత్ర పోషిస్తున్న పవన్, ఓ పడవలోకి ఎక్కిస్తున్న వజ్రాల్ని దొంగతనం చేయడానికొస్తాడట. ఆ సమయంలో విజువల్స్ నిజంగా అద్భుతంగా ఉంటాయట. ముఖ్యంగా పడవ ఓనర్ (మురళీ శర్మ)కు చెప్పి మరీ పవన్ దొంగతనం చేసే యాక్షన్ సీన్ అయితే, సినిమా మొత్తంలోనే మెయిన్ హైలైట్ అవుతుందని అంటున్నారు.

కాగా డైరెక్టర్ జ్యోతి కృష్ణ దర్శకత్వంలో ఈ సినిమా రాబోతుంది. ఈ సినిమాలో నిధి అగర్వాల్ తో పాటు బాబీ డియోల్, సునీల్, రఘుబాబు, సుబ్బరాజు మరియు నోరా ఫతేహి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కాగా మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎ దయాకర్ రావు నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఎం ఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. అన్నట్టు క్రిష్ జాగర్లమూడి ఈ సినిమాలోని పలు సన్నివేశాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే.

తాజా వార్తలు