‘ది సస్పెక్ట్’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేసిన మేకర్స్!

‘ది సస్పెక్ట్’ ఫస్ట్ లుక్ పోస్టర్ లాంచ్ చేసిన మేకర్స్!

Published on Mar 11, 2025 11:00 AM IST

the suspect

యువ నటీనటులు రుషి కిరణ్, శ్వేతలు నటించిన లేటెస్ట్ థ్రిల్లర్ చిత్రమే “ది సస్పెక్ట్”. ఈ సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టరు ను మేకర్స్ సూపర్ హిట్ డైరెక్టర్ విఎన్ ఆదిత్య చేతుల మీదుగా లాంచ్ చేశారు. ఈ సందర్భంగా వి.ఎన్ ఆదిత్య మాట్లాడుతూ అద్భుతమైనటువంటి స్క్రీన్ ప్లే తో సస్పెన్స్ థ్రిల్లర్ మరియు క్రైమ్ మూవీ అయినటువంటి ది సస్పెక్ట్ చిత్రం కచ్చితంగా మంచి హిట్ కొడుతుంది. కొత్త కథతో ఈ సినిమా తెరకెక్కించడం చాలా ఆనందమని కొనియాడారు.

ఈ సినిమాకి రాధాకృష్ణ గర్నెపూడి దర్శకత్వం వహించగా టెంపుల్ టౌన్ టాకీస్ బానర్ మీద నిర్మించారు. క్రైమ్ థ్రిల్లర్ లో విభిన్నమైనటువంటి కోణంలో ప్రత్యేక పరిశోధన బృందం ఒక క్రైమ్ ని ఎలా కనుక్కున్నారు అని దర్శకుడు తన ప్రతిభతో అద్భుతంగా తెరకెక్కించారు.

కిరణ్ కుమార్ నిర్మాతగా టెంపుల్ టౌన్ టాకీస్ సమర్పణలో రాబోతున్న
ది సస్పెక్ట్ చిత్రం ప్రేక్షకులకు కొత్త ఫీల్ ఇస్తుంది అని చిత్ర యూనిట్ తెలియచేసారు. ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించిన కెమెరామెన్ రాఘవేంద్ర, మ్యూజిక్ డైరెక్టర్ ప్రజ్వల్ క్రిష్, ఎడిటర్ ప్రవీణ్ ప్రతిభ చిత్రంలో కనబడుతుంది అంటున్నారు.

ఇక ఈ చిత్రాన్ని ఎస్ కె ఎమ్ ఎల్ మోషన్ పిక్చర్స్ ద్వారా ఆంధ్ర మరియు తెలంగాణలో గ్రాండ్ గా మార్చి 21న విడుదల చేయబోతున్నారు.

తాజా వార్తలు