మన టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ హీరోగా ఇపుడు పలు భారీ సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మరి ఈ చిత్రాల్లో దర్శకుడు అయాన్ ముఖర్జీతో బాలీవుడ్ లో చేస్తున్న చిత్రం వార్ 2 కూడా ఒకటి. అయితే ఈ సినిమా షూటింగ్ లో ఎప్పటికప్పుడు పాల్గొంటున్న తారక్ లేటెస్ట్ గా మరోసారి ఆ సినిమా లుక్ లో కనిపించడం జరిగింది. అయితే ఈ క్రమంలో తారక్ లుక్ ఒకటి బయటకి రాగా దానితో పాటుగా తన చేతికి ధరించిన వాచ్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది.
అయితే ఈ వాచ్ ఏకంగా 7 కోట్లకి పైగా ఖరీదు చేస్తుంది అని తెలుస్తుంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖ లగ్జరీ వాచ్ కంపెనీ అయినటువంటి రిచర్డ్ మిల్లీ నుంచి ఆర్ఎం 40-01 టర్బిలోన్ ఎడిషన్ గా తెలుస్తుంది. దీనితో ఈ వాచ్ మన దేశపు కరెన్సీలో సుమారు ఏడున్నర కోట్ల రూపాయలట. దీనితో తన వాచ్ కోసం ఇపుడు సోషల్ మీడియాలో అభిమానులు సహా బాలీవుడ్ వర్గాలు కూడా మాట్లాడుకుంటున్నాయి.


