హెచ్చరిక: ‘హిట్ 3’ నుంచి ఈ ఆడియెన్స్ దూరంగా ఉండాలి

హెచ్చరిక: ‘హిట్ 3’ నుంచి ఈ ఆడియెన్స్ దూరంగా ఉండాలి

Published on Apr 13, 2025 5:00 PM IST

HI NANI 12

నాచురల్ స్టార్ నాని హీరోగా శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కించిన లేటెస్ట్ అవైటెడ్ చిత్రమే “హిట్ 3”. తన హిట్ సినిమాటిక్ యూనివర్స్ ఫ్రాంచైజ్ నుంచి వస్తున్న మూడో చిత్రం ఇది కాగా దీనిపై గట్టి అంచనాలు ఇపుడు పెరుగుతూ వెళుతున్నాయి. అయితే ఈ సినిమాలో వైలెన్స్ ఏ రేంజ్ లో ఉంటుందో మొన్నామధ్య వచ్చిన టీజర్ చూస్తేనే అర్ధం అయ్యింది.

కానీ గత కొన్ని రోజులు నుంచి మాత్రం ఈ సినిమాలో వైలెన్స్ ఎపిసోడ్స్ మరింత లెవెల్లో ఉంటాయని టాక్ వచ్చింది. ఇక ఇపుడు దీనిని నిజం చేస్తున్నారు. ఈ చిత్రానికి సెన్సార్ పూర్తి కాగా సెన్సార్ యూనిట్ వారు ఏ రేటెడ్ సర్టిఫికెట్ ఇచ్చారు. అలాగే మేకర్స్ ఈ చిత్రానికి చిన్న పిల్లలు, అలాగే సున్నిత మనస్కులు లాంటి వారు దూరంగా ఉండాలని ఇపుడు నుంచే హెచ్చరిస్తున్నారు. దీనితో హిట్ 3 ఎలా ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. మరి ఈ మే 1న రాబోతున్న ఈ చిత్రం ఎలా ఉండబోతుందో చూడాలి.

తాజా వార్తలు