నా కెరీర్ లోనే ఇది బెస్ట్ సినిమా – నాగచైతన్య

నా కెరీర్ లోనే ఇది బెస్ట్ సినిమా – నాగచైతన్య

Published on Mar 5, 2026 5:58 PM IST

Vrushakarma

అక్కినేని నాగచైతన్య నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘వృషకర్మ’. తాజాగా ఈ మూవీ గ్లింప్స్‌ రిలీజ్‌ చేశారు. ఈ సందర్భంగా చైతన్య మాట్లాడుతూ.. ‘వృషకర్మ’ తన కెరీర్ లో బెస్ట్ ఫిలిం అవుతుంది. ఎన్ని అంచనాలు పెట్టుకున్నా.. తప్పకుండా సంతృప్తి చెందుతారు. ఇవాళ నాకు ఎంతో ఆనందంగా ఉంది. ‘వృషకర్మ’ గ్లిమ్స్ లాంచ్ చేశాం. ఈ మోమెంట్ కోసం నేను ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాను. ఎందుకంటే ఇది నా కెరీర్ లో 100% బెస్ట్ సినిమా అవ్వబోతుంది’ అని చైతు తెలిపారు.

దర్శకుడు కార్తీక్ దండు డైరెక్ట్ చేస్తున్న ఈ అడ్వెంచర్‌ థ్రిల్లర్‌లో అర్జున్‌ అనే నిధి అన్వేషకుడిగా కనిపించబోతున్నారు. చైతుకి జోడీగా మీనాక్షి చౌదరి నటిస్తోంది. మొత్తానికి ఈ గ్లింప్స్‌ చాలా బాగా ఆకట్టుకుంటుంది. ఈ గ్లింప్స్‌తో ‘వృషకర్మ’లో మంచి విజువల్ ట్రీట్ ఇచ్చారు. ఈ సినిమాకి అజనీష్ లోక్‌నాథ్ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర బ్యానర్‌పై బివిఎస్ఎన్ ప్రసాద్ ప్రొడ్యూస్ చేస్తున్నారు.

తాజా వార్తలు