వీరు ఉలవల దర్శకత్వంలో రాబోతున్న సినిమా ‘పురుష:’ బ్రహ్మచారి భర్త కావాలని నిర్ణయించుకున్న తరువాత జీవితం యుద్ధభూమిగా మారుతుంది అనే లైన్స్‌తో సినిమాపై ఆసక్తి పెంచేశారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. బత్తుల సరస్వతి సమర్పణలో కళ్యాణ్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.1గా బత్తుల కోటేశ్వరరావు నిర్మాతగా పవన్ కళ్యాణ్ తెరంగేట్రం చేస్తున్నారు. విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో ఈ మూవీని శనివారం నాడు ఘనంగా ప్రారంభించారు. ఈ చిత్ర ప్రారంభ ముహుర్తానికి వడ్డవల్లి వెంకటేశ్వర రావు(బుల్లబ్బాయ్) క్లాప్ కొట్టగా, బేబీ ఏముల ధరణి కెమెరా స్విచ్ ఆన్ చేశారు.
మళ్లీ రావా , జెర్సీ, మసుధ చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేసిన వీరు ఉలవలను ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు. తన శిష్యుడి కోసం సెన్సిబుల్ డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరి ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ లోగో, పోస్టర్‌ను రిలీజ్ చేశారు. అనంతరం చిత్రయూనిట్‌కు ఆయన ఆల్ ది బెస్ట్ తెలిపారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫర్ సతీష్ ముత్యాల, సంగీత దర్శకుడు శ్రవణ్ భరద్వాజ్, ఎడిటర్ కోటి. ఈ సినిమాలో వైష్ణవి కొక్కుర, విషిక, హాసిని సుధీర్‌లు కథానాయికలుగా నటిస్తుండగా.. వెన్నెల కోషోర్, సప్తగిరి, కసిరెడ్డి రాజకుమార్, వి.టి.వి.గణేష్ ముఖ్య పాత్రలను పోషిస్తున్నారు.


