సల్మాన్.. ఇతర బాలీవుడ్ స్టార్స్ పై విమర్శలు!

సల్మాన్.. ఇతర బాలీవుడ్ స్టార్స్ పై విమర్శలు!

Published on May 11, 2025 2:14 PM IST

Salman Khan 1

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా నెలకొన్న పరిస్థితులు కోసం అందరికీ తెలిసిందే. భారత్ మరియు పాకిస్తాన్ నడుమ యుద్ధ వాతావరణం ఉత్కంఠగా మారింది. అయితే భారత్ పాకిస్తాన్ కి ఆపరేషన్ సిందూర్ తో గట్టి సమాధానం పంపగా దీనికి అనేకమందికి సినీ ప్రముఖులు మద్దతు పలికారు. కానీ బాలీవుడ్ నుంచి అనేకమంది స్టార్స్ ఎలాంటి రెస్పాన్స్ చూపించలేదు. ఒక్క అక్షయ్ కుమార్ మినహా ఏ స్టార్ కూడా ఆపరేషన్ సిందూర్ కోసం మాట్లాడిన దాఖలాలు లేవు.

మరి బాలీవుడ్ స్టార్స్ షారుఖ్ ఖాన్, అమీర్ ఖాన్, సల్మాన్ ఖాన్ లాంటి స్టార్ మౌనం మరింత చర్చకి దారి తీసింది. ఇక వీటితో పాటుగా సల్మాన్ ఖాన్ పై పలు విమర్శలు వస్తున్నాయి. పాకిస్తాన్ తో సీజ్ ఫైర్ పై మాత్రం సల్మాన్ ఖాన్ పోస్ట్ చేసి డిలీట్ చేయడంపై సోషల్ మీడియాలో నెటిజన్స్ లో హాట్ టాపిక్ గా మారింది. వీరు భారత్ కోసం ఇలాంటి స్టాండ్ తీసుకుంటున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

తాజా వార్తలు