వైవిధ్యమైన పాత్రలతో కథానాయికగా తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న లావణ్య త్రిపాఠి, మలయాళ నటుడు దేవ్ మోహన్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చిత్రం ‘సతీ లీలావతి’. ప్రముఖ నిర్మాణ సంస్థ ఆనంది ఆర్ట్స్ సమర్పణలో దుర్గాదేవి పిక్చర్స్ బ్యానర్‌పై నాగమోహన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు ‘భీమిలీ కబడ్డీ జట్టు’, ఎస్.ఎం.ఎస్(శివ మనసులో శృతి) ఫేమ్ తాతినేని సత్య దర్శకత్వం వహిస్తున్నారు.
భార్యాభర్తల మధ్య ప్రేమానుబంధాలను తెలియజేస్తూ ఎంటర్టైన్మెంట్, ఎమోషనల్ అంశాలతో ‘సతీ లీలావతి’ సినిమాను రూపొందిస్తున్నారు. సినిమా చిత్రీకరణ తుది దశకు చేరుకుంది. మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. అందులో భాగంగా డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభం అయ్యాయి. అనుకున్న ప్లానింగ్ ప్రకారం మేకర్స్ సినిమాను శరవేగంగా పూర్తి చేస్తున్నారు.
వీలైనంత త్వరగా షూటింగ్ చేసి సమ్మర్ కానుకగా ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని మేకర్లు ప్లాన్ చేస్తున్నారు. ఫీల్ గుడ్ మూవీగా అందరినీ ఆకట్టుకునేలా, అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించేలా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నట్లు మేకర్స్ తెలిపారు.


