టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ సినిమా అంటే పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ‘హను-మాన్’ సినిమాతో ఆయన సృష్టించిన ప్రభంజనం అది. ఇక తన సినిమాటిక్ యూనివర్స్‌లో చాలా సినిమాలు ఉండబోతున్నాయని ప్రశాంత్ వర్మ గతంలోనే వెల్లడించారు. ఇందులో భాగంగా ‘మహాకాళి’ అనే సినిమాను మేకర్స్ తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్‌ను పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. ఈ సినిమాను పూజా కొల్లూరు డైరెక్ట్ చేయనున్నారు. ఇక ఈ సినిమా లేడీ ఓరియెంటెడ్ సూపర్ హీరో మూవీగా రానుంది. అయితే, ఈ సినిమాలో లీడ్ రోల్‌లో ఎవరు నటిస్తారనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.
ఆర్‌కెడి స్టూడియోస్ అత్యంత భారీ బడ్జెట్‌తో ప్రొడ్యూస్ చేయనున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అక్షయ్ ఖన్నా విలన్‌గా నటిస్తాడనే టాక్ వినిపిస్తోంది. మరి ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ కోసం మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.



