‘వీరమల్లు’ క్లారిటీ పైనే అందరి కళ్ళు!

‘వీరమల్లు’ క్లారిటీ పైనే అందరి కళ్ళు!

Published on May 13, 2025 7:02 AM IST

Hari Hara Veera Mallu

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా దర్శకుడు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న అవైటెడ్ సినిమా హరిహర వీరమల్లు కోసన్ అందరికీ తెలిసిందే. అయితే ఎప్పుడు నుంచో పలు వాయిదాల తో షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా కేవలం ఆ షూటింగ్ ఆలస్యం వల్ల విడుదల ఆలస్యం అవుతూ వచ్చింది.

ఇక ఫైనల్ గా షూట్ అయ్యాక సినిమా రిలీజ్ కి మళ్లీ బ్రేక్ పడింది. ఇపుడు సమయం గడుస్తుండడం తో అభిమానులు ఆ కొత్త రిలీజ్ డేట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. దీనితో కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడు వస్తుంది అనే దాని పైనే అందరి దృష్టి పడింది. మరి చూడాలి మేకర్స్ ఎప్పుడు వీరమల్లుని తీసుకొస్తారు అనేది.

తాజా వార్తలు