హాలీవుడ్ స్టార్ నటుడు టామ్ క్రూయిజ్ హీరోగా నటించిన ఎవర్ గ్రీన్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ “మిషన్ ఇంపాజిబుల్” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఫ్రాంచైజ్ నుంచి వచ్చిన చివరి చిత్రమే “మిషన్ ఇంపాజిబుల్ – ది ఫైనల్ రెకోనింగ్”. అయితే ఈ ఫ్రాంచైజ్ కి పర్ఫెక్ట్ గా వచ్చిన ఈ చిత్రం వరల్డ్ వైడ్ భారీ అంచనాలు నడుమ వచ్చింది.
మరి ఈ చిత్రానికి మన దేశంలో కూడా మంచి ఫాలోయింగ్ ఉండగా ఈ చిత్రం ఇండియా వైడ్ గా సాలిడ్ ఓపెనింగ్స్ అందుకున్నట్టుగా పి ఆర్ లెక్కలు చెబుతున్నాయి. దీనితో ‘మిషన్ ఇంపాజిబుల్ – ది ఫైనల్ రెకోనింగ్’ చిత్రం 17 కోట్లకి పైగా గ్రాస్ ని అందుకున్నట్టుగా తెలుస్తుంది. దీనితో ఈ ఏడాదిలో ఓ హాలీవుడ్ సినిమాకి ఇదే అత్యధికం అని టాక్. మరి ఆల్రెడీ టాక్ ఎలాగో బాగుంది కాబట్టి ఫైనల్ రన్ లో మంచి వసూళ్లతోనే ముగుస్తుంది అని చెప్పొచ్చు.


