ప్రపంచం ముందుకు ‘విశ్వంభర పుస్తకం’.. ఇంతకీ అసలు కథ ఏమిటో?

ప్రపంచం ముందుకు ‘విశ్వంభర పుస్తకం’.. ఇంతకీ అసలు కథ ఏమిటో?

Published on May 22, 2025 12:58 PM IST

vishwambhara Book

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ప్రెస్టీజియస్ చిత్రం ‘విశ్వంభర’ కోసం ప్రేక్షకులు ఏ రేంజ్‌లో ఎదురుచూస్తున్నారో అందరికీ తెలిసిందే. దర్శకుడు వశిష్ఠ మల్లిడి డైరెక్ట్ చేస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రాన్ని భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాతో బాక్సాఫీస్ దగ్గర మెగాస్టార్ సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఈ సినిమా షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఈ పనులు ఆలస్యం అవుతున్న నేపథ్యంలో ఈ చిత్రం రిలీజ్ వాయిదా పడుతూ వస్తోంది. అయితే, తాజాగా ఈ చిత్రాన్ని అంతర్జాతీయ స్టేజీపై నిలబెట్టారు చిత్ర నిర్మాత విక్రమ్ రెడ్డి. కేన్స్ ఫిలిం ఫెస్టివల్‌లో ‘విశ్వంభర’ చిత్ర ప్రమోషన్స్‌ను వేరే లెవెల్‌లో చేస్తున్నారు. తాజాగా ఆయన ఈ చిత్రానికి సంబంధించి ‘విశ్వంభర పుస్తకం’ ప్రపంచం ముందుకు తీసుకొచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

ఇంతకీ ఈ విశ్వంభర పుస్తకం ఏమిటి..? ఈ పుస్తకంలో ఏముంది..? అని అభిమానులతో పాటు సినీ సర్కిల్స్ ఆసక్తిగా చూస్తున్నారు. ఈ పుస్తకంలో ఏముందనే విషయాన్ని త్వరలోనే రివీల్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. ఇక ఈ సినిమాలో త్రిష హీరోయిన్‌గా నటిస్తుండగా ఆషికా రంగనాథ్, కునాల్ కపూర్, రమ్య పసుపులేటి, ఇషా చావ్లా తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఎం.ఎం.కీరవాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్ర రిలీజ్ డేట్‌ను త్వరలో అనౌన్స్ చేసేందుకు మేకర్స్ రెడీ అవుతున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు