హనుమాన్ జయంతి నాడు గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం!

హనుమాన్ జయంతి నాడు గుడ్ న్యూస్ చెప్పిన కిరణ్ అబ్బవరం!

Published on May 22, 2025 10:36 PM IST

Kiran Abahavaram. 1j pg

మన టాలీవుడ్ సినిమా యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోస్ లో కిరణ్ అబ్బవరం కూడా ఒకడు. మరి కిరణ్ అబ్బవరం హీరోగా రీసెంట్ గానే ‘క ర్యాంప్’ సినిమా స్టార్ట్ చేశాడు. అయితే దీనికి ముందే తన భార్య యువ హీరోయిన్ రహస్య గోరక్ గర్భవతి అయ్యిన గుడ్ న్యూస్ ని షేర్ చేసుకొని అతి త్వరలోనే తాము తల్లిదండ్రులు కాబోతున్నారు అనే వార్త షేర్ చేసుకొని ఆనందం వ్యక్తం చేశారు.

మరి లేటెస్ట్ గా ఈ ఆనందం నేడు హనుమాన్ జయంతి నాడు మరింత అయ్యింది. ఒక బ్యూటిఫుల్ పిక్ ని షేర్ చేసుకొని ఈ హనుమాన్ జయంతి నాడు పండంటి మగ బిడ్డకి తన భార్య జన్మనిచ్చినట్టు తెలిపారు. అలాగే తన పుత్రోత్సాహం ఆ పిక్ లో కిరణ్ అబ్బవరం లో చూడవచ్చు. దీనితో ఈ పిక్ చూసిన ఫాలోవర్స్ తనకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

తాజా వార్తలు