పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇపుడు మళ్ళీ యాక్షన్ స్టార్ట్ చేశారు. గత కొంత కాలం నుంచి ముందుకు కదలకుండా ఉన్న సినిమాలు వరుసగా చేస్తూ ఇంకో పక్క చురుగ్గా పాలిటిక్స్ లో కూడా పాల్గొంటున్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కి మంచి కిక్ ఇస్తున్నారు. అయితే పవర్ స్టార్ హీరోగా చేస్తున్న లేటెస్ట్ చిత్రాల్లో ఒకటి “ఉస్తాద్ భగత్ సింగ్”.
దర్శకుడు హరీష్ శంకర్ తో చేస్తున్న ఈ సాలిడ్ మాస్ ఎంటర్టైనర్ షూటింగ్ కొంతమేర కంప్లీట్ అయ్యింది. ఇక ఈ షూట్ తర్వాత మళ్ళీ షూటింగ్ పై మేకర్స్ కొత్త అప్డేట్ ఇవ్వడంతో పాటుగా ఓ ఊహించని టాక్ ఒకటి వైరల్ గా మారింది. ఇది వరకు ఉస్తాద్ భగత్ సింగ్ చిత్రం ఒక రీమేక్ అని ప్రొజెక్ట్ అయ్యిన సంగతి తెలిసిందే.
దీనిపై గట్టి నెగిటివ్ కూడా వచ్చింది. కానీ తాజాగా ఇది రీమేక్ కాదు స్ట్రైట్ సినిమా కథ మార్చేశారు ఇది ఒరిజినల్ స్టోరీ అని అంటున్నారు. దీంతో ఉస్తాద్ భగత్ సింగ్ పై ఈ కొత్త టాక్ ఫ్యాన్స్ లో ఆసక్తిగా మారింది. ఒకవేళ ఇది నిజం అయితే పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ మూడు స్ట్రైట్ సినిమాలతో రాబోతున్నారని చెప్పాలి.


