ఎన్టీఆర్ జయంతి.. తారక్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

ఎన్టీఆర్ జయంతి.. తారక్ ఎమోషనల్ పోస్ట్ వైరల్!

Published on May 28, 2025 9:49 AM IST

JrNTR

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ పలు చిత్రాలు చేస్తున్న సంగతి తెలిసిందే. మొదటిగా వార్ 2 రాబోతుండగా దీనికి సాలిడ్ హైప్ ఉంది. దీని తర్వాత ప్రశాంత్ నీల్ కలయికలో సినిమాలో తాను హీరోగా చేస్తున్నాడు. అయితే ఈ రెండు సినిమాల గ్యాప్ లో నేడు మే 28 సీనియర్ ఎన్టీఆర్ జయంతి వచ్చింది. మరి నందమూరి అభిమానులకి అలాగే వారి కుటుంబానికి ఈ రోజు ఎంత ప్రత్యేకం అనేది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఇది 102వ జయంతి కాగా నేడు ఉదయాన్నే జూనియర్ ఎన్టీఆర్ సహా తన సోదరుడు కళ్యాణ్ రామ్ లు ఇద్దరు కూడా చేరుకొని అక్కడ సమయం గడిపి ఎమోషనల్ అయ్యిన దృశ్యాలు వైరల్ గా మారాయి. ఇక ఈ తర్వాత ఎన్టీఆర్ నుంచి ప్రతీ ఏడాది వచ్చే ఎమోషనల్ పోస్ట్ కూడా వచ్చింది. “మీ పాదం మోపక తెలుగు ధరిత్రి చిన్నబోతోంది మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈ గుండెని మరొక్కసారి తాకిపో తాతా..” అంటూ తారక్ పోస్ట్ చేయడం ఇపుడు వైరల్ గా మారింది.

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు