థియేటర్స్ లో ‘ఖలేజా’ ఫ్యాన్స్ కి ట్విస్ట్!

థియేటర్స్ లో ‘ఖలేజా’ ఫ్యాన్స్ కి ట్విస్ట్!

Published on May 30, 2025 8:07 AM IST

khaleja 1

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా అనుష్క శెట్టి హీరోయిన్ గా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ తెరకెక్కించిన చిత్రం “ఖలేజా” కోసం అందరికీ తెలిసిందే. అయితే ఈ సినిమా అప్పట్లో ప్లాప్ అయ్యింది కానీ ఆ తర్వాత మాత్రం సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. ఇలా ఫైనల్ గా రీరిలీజ్ కి వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ బుకింగ్స్ ని వరల్డ్ వైడ్ చూపిస్తూ అందరికీ షాకిచ్చింది. ఇలా ఉన్న క్రేజ్ తో ఒక రోజు ముందే ప్రీమియర్స్ తో వచ్చిన ఈ సినిమా థియేటర్స్ లో ఫ్యాన్స్ కి ఒక ఊహించని ట్విస్ట్ ఇచ్చింది.

సినిమాలో పలు సాంగ్స్ ఇంకా సీన్స్ ని కూడా కట్ చేసి ప్రదర్శించడం మొదట ఫ్యాన్స్ కి ఒకింత షాకిస్తే తర్వాత ఆగ్రహం తెప్పించింది. దీనితో థియేటర్స్ యాజమాన్యంతో కూడా వాగ్వాదానికి వెళ్లే దిశగా పరిస్థితులకి దారి తీసింది. అయితే తమకి ప్రింట్ అలానే వచ్చింది అని వారు చెబుతున్నారు. దీనితో ఎన్నో ఆశలు పెట్టుకొని ఫ్యాన్స్ కి మాత్రం ఖలేజా థియేటర్స్ లో ఫుల్ ఎంటర్టైన్మెంట్ మళ్ళీ దక్కలేదని చెప్పక తప్పదు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు

వీక్షకులు మెచ్చిన వార్తలు