పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హీరోయిన్స్ శ్రీలీల అలాగే రాశీ ఖన్నా కలయికలో వస్తున్న సాలిడ్ చిత్రం ఉస్తాద్ భగత్ సింగ్ కోసం అందరికీ తెలిసిందే. గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ తెరకెక్కించిన ఈ సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుండగా ఈ సినిమా ప్రమోషన్స్ ఆల్రెడీ మేకర్స్ మొదలు పెట్టారు.
ఇక ఇందులో భాగంగా దర్శకుడు హరీష్ శంకర్ ఇచ్చిన లేటెస్ట్ ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలే పంచుకున్నారు. మరి వాటిలో ఓ కీలక డైలాగ్ విషయంలో క్లారిటీ ఇచ్చారు. గతంలో వచ్చిన ఓ గ్లింప్స్ లో పవన్ “ఈసారి పెర్ఫామెన్స్ బద్దలైపోద్ది” అని పేల్చిన డైలాగ్ ఎలా వైరల్ అయ్యిందో తెలిసిందే.
మరి ఈ డైలాగ్ ని తాను ఊరికే పెట్టలేదని కళ్యాణ్ గారి నటన ఆ లెవెల్లోనే ఉంటుందని తెలిపారు. గబ్బర్ సింగ్ పోలిస్తే బలమైన ఎమోషన్స్ ఇందులో మరింత ఎక్కువ ఉన్నాయని అలాగే కళ్యాణ్ గారి నటన కూడా అదే రేంజ్ లో ఉంటుందని అందుకే ఆ డైలాగ్ మాత్రం ఏదో ఊరికే పెట్టలేదని కన్ఫర్మ్ చేశారు.
"Ee saari performance Badhalaipoddi" 🔥🔥#UstaadBhagatSingh #UBSOnMarch26th pic.twitter.com/TYsnjgQUYs
— Ustaad Bhagat Singh (@UBSTheFilm) March 2, 2026


