ఘనంగా “స్కై” సినిమా నుంచి ‘ఎమోషన్ ఆఫ్ ది స్కై’ టీజర్ లాంఛ్

ఘనంగా “స్కై” సినిమా నుంచి ‘ఎమోషన్ ఆఫ్ ది స్కై’ టీజర్ లాంఛ్

Published on May 31, 2025 8:30 AM IST

Untitled 24

మురళీ కృష్ణంరాజు, శృతి శెట్టి జంటగా నటిస్తున్న సినిమా “స్కై”. ఈ చిత్రాన్ని వాలోర్ ఎంటర్‌టైన్‌మెంట్ స్టూడియోస్ బ్యానర్ లో నాగిరెడ్డి గుంటక, పృథ్వీ పెరిచెర్ల, శ్రీ లక్ష్మీ గుంటక, మురళీ కృష్ణంరాజు నిర్మిస్తున్నారు. పృథ్వీ పెరిచెర్ల దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో విడుదలకు సిద్ధమవుతున్న “స్కై” సినిమా నుంచి ‘ఎమోషన్ ఆఫ్ ది స్కై’ టీజర్ లాంఛ్ చేశారు. హైదరాబాద్ లో జరిగిన ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ పాల్గొన్నారు.

ఈ సందర్భంగా హీరోయిన్ శృతి శెట్టి మాట్లాడుతూ.. “స్కై” సినిమాలో నటించే అవకాశం రావడం సంతోషంగా ఉంది. ఈ అవకాశం కల్పించిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. మా టీమ్ అంతా మనసు పెట్టి ఈ మూవీకి వర్క్ చేశాం. వీలైనంత త్వరగా “స్కై” సినిమాను మీ ముందుకు తీసుకురావాలని ఎగ్జైటింగ్ గా ఉన్నాం. మా సినిమా ప్రతి ఒక్క ఆడియెన్ కు నచ్చుతుంది అని అన్నారు.

హీరో, నిర్మాత మురళీ కృష్ణంరాజు మాట్లాడుతూ.. నన్ను నేను హీరోగా కంటే ఒక నటుడిగా భావిస్తా. ఈ సినిమాలో ప్రతిభ గల టీమ్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. రీసెంట్ గా మా మూవీ స్క్రీనింగ్ చేసినప్పుడు నా క్యారెక్టర్ ను మర్చిపోయి సినిమాను ఎంజాయ్ చేశా. నేను ఎలా నటించాను అని మా టీమ్ మెంబర్స్ ను అడిగితే ఎంకరేజింగ్ గా చెప్పారు. మా టీమ్ లో రసూల్ గారి లాంటి చాలా ఎక్సిపీరియన్స్ టెక్నీషియన్ ఉండటం ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. త్వరలోనే “స్కై” మూవీతో మీ ముందుకు వచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం. అని అన్నారు.

సినిమాటోగ్రాఫర్ రసూల్ ఎల్లోర్ మాట్లాడుతూ.. ఒక కాంపాక్ట్ బడ్జెట్ లో పర్పెక్ట్ గా ఒక మూవీ చేస్తే ఎలా ఉంటుంది అనేందుకు మా “స్కై” సినిమా ఎగ్జాంపుల్. ఛాలెంజింగ్ గా తీసుకుని ఈ సినిమాకు ప్రతి ఒక్కరం పనిచేశాం. ఆ ప్రయత్నంలో సక్సెస్ అయ్యామని నమ్ముతున్నాం. డైరెక్టర్ పృథ్వీ పొయెటిక్ కథతో చాలా ప్యాషనేట్ గా ఈ మూవీని రూపొందించారు. మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని కోరుకుంటున్నా. అని అన్నారు.

డైరెక్టర్ పృథ్వీ పెరిచెర్ల మాట్లాడుతూ.. సినిమా మేకింగ్ అంటే ఏంటో, ఏ క్రాఫ్టులు కలిసి పనిచేస్తాయో అవగాహన తెచ్చుకుంటూ ఈ చిత్రానికి సన్నాహాలు చేసుకున్నాం. డైరెక్టర్ గా నాకు ఇది డెబ్యూ మూవీ. నేను ముందు ప్రొడ్యూసర్ నాగిరెడ్డి గారిని కలిశాను. ఆ తర్వాత రసూల్ గారిని కలిశాను. సినిమా మీద ప్యాషన్ తో మేమంతా వర్క్ చేశాం. ఇటీవల “స్కై” మూవీ షో చూసి మూవీ చాలా బాగుందని అంతా చెప్పారు. చాలా హ్యాపీగా ఫీలయ్యాం. మనకున్న బడ్జెట్ లో మంచి సినిమా చేయగలం, ఆడియెన్స్ కు ఒక సినిమాటిక్ ఎక్స్‌పీరియన్స్ ఇవ్వగలం అనే నమ్మకం కలిగింది. ఇలాంటి మంచి కథలు తెరపైకి తెచ్చే ప్రయత్నం చేస్తూనే ఉంటాం. అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు