ఘనంగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ ట్రైలర్ లాంఛ్.. జూన్ 6న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ

ఘనంగా ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ ట్రైలర్ లాంఛ్.. జూన్ 6న గ్రాండ్ రిలీజ్‌కు రెడీ

Published on May 31, 2025 9:30 AM IST

Untitled 25 1

చిత్ర పరిశ్రమలోకి ఎన్టీఆర్ బావమరిదిగా ఎంట్రీ ఇచ్చి వరుస విజయాలు అందుకుంటున్న యంగ్ అండ్ ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్. దర్శకుడు సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నార్నె నితిన్ కాంబోలో తెరకెక్కిన ‘శ్రీ శ్రీ శ్రీ రాజావారు’ జూన్ 6న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. సంపద హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వేధాక్షర మూవీస్ పతాకంపై చింతపల్లి రామారావు నిర్మించారు. తాజాగా ఈ చిత్ర ట్రైలర్ ను హైదరాబాద్‌లో రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమంలో చిత్ర దర్శకుడు సతీష్ వేగేశ్న, నిర్మాత చింతపల్లి రామారావు, కో ప్రొడ్యూసర్ సుబ్బారెడ్డి,, దర్శక నిర్మాత రాజేష్ పుత్ర, రఘు కుంచే, రచ్చ రవి, సంగీత దర్శకుడు కైలాషా మీనన్ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా దర్శకుడు సతీష్ వేగేశ్న మాట్లాడుతూ.. ‘మా “శ్రీ శ్రీ శ్రీ రాజావారు” సినిమా సాంగ్స్, ట్రైలర్ ను సక్సెస్ చేసిన మీ అందరికీ థ్యాంక్స్. ఈ సినిమాలో నరేష్ గారు ఒక డైలాగ్ చెబుతారు. మనల్ని మనం జయించుకోవడమే సక్సెస్ అంటే. ఈ కాన్సెప్ట్ తో సినిమాను రూపొందించాం. మా హీరో నార్నే నితిన్ పక్కింటి కుర్రాడిలా మొదలుపెట్టి, యాక్షన్ పరంగా ఆకట్టుకుంటూ అద్భుతంగా పర్ ఫార్మ్ చేశాడు. హీరోయిన్ సంపద మిమ్మల్ని ఆకట్టుకుంటుంది. నా సినిమాల్లో ఎక్కువమంది ఆర్టిస్టులు ఉంటారు. కారణం మన కుటుంబాల్లో ఎలా ఎక్కువమంది మనవాళ్లు ఉండేవారే. నా కథల్లోనూ అలాంటి పాత్రలే పలకరిస్తాయి. మరుగున పడిన కొన్నింటిని చూపించాలనే నా మూవీస్ ద్వారా తాపత్రయపడుతుంటాను. అలాంటి ప్రయత్నమే “శ్రీ శ్రీ శ్రీ రాజావారు” . ఈ సినిమా మిమ్మల్ని నిరాశపర్చదు. అన్ని విషయాల్లో ఆకట్టుకుంటుంది. నా టెక్నికల్ టీమ్ అందరూ చాలా కష్టపడి పనిచేశారు. అయితే మేము ఎంత కష్టపడినా మీ ఆదరణ ఉంటేనే సక్సెస్ అవుతుంది. జూన్ 6న థియేటర్స్ లోకి వస్తున్న “శ్రీ శ్రీ శ్రీ రాజావారు” సినిమాను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నా.’ అని అన్నారు.

నిర్మాత చింతపల్లి రామారావు మాట్లాడుతూ.. ‘ఒక మంచి కమర్షియల్ ఎలిమెంట్స్‌తో బిగ్ హిట్ మూవీని నిర్మించాలని నార్నె నితిన్, వేగేశ్న సతీష్ కాంబినేషన్లో ఈ చిత్రాన్ని రూపొందించాం. మా చిత్ర హీరో నార్నె నితిన్ ఇటీవల మంచి యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీస్ తో వరుస విజయాలు అందుకుంటున్నారు. ఇక శ్రీ శ్రీ రాజావారు విషయానికొస్తే మంచి గ్రామీణ నేపథ్యంలో సాగే వెరైటీ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. పూర్తి కమర్షియల్ ఫార్మాట్ లో భారీ తారాగణంతో తెరకెక్కించారు దర్శకుడు సతీష్ వేగేశ్న. అలాగే ఎన్టీఆర్ ఎంతో మెచ్చి, ఈ కథను ఎంపిక చేశారు. ఆయన అంచనాల మేరకు దర్శకుడు ఈ చిత్రాన్ని ఎక్కడా రాజీపడకుండా తెరకెక్కించారు. కచ్చితంగా ఈ జూన్ 6న నార్నె నితిన్ ఖాతాలో ఆయ్, మ్యాడ్ తరహాలో మరో సూపర్ హిట్ హిట్ పడుతుందని గట్టిగా నమ్ముతున్నాం.’ అని అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు