స్టార్ బోయ్ సిద్ధు జొన్నలగడ్డ నటిస్తున్న లేటెస్ట్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ‘తెలుసు కదా’. ఈ సినిమాను నీరజ కోన డైరెక్ట్ చేస్తుండగా ఇందులో రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి హీరోయిన్లుగా నటిస్తున్నారు. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. సిద్దూ తన స్టైల్‌లో ఫన్నీగా దీన్ని రివీల్ చేశారు. రాశీ ఖన్నా, శ్రీనిధి శెట్టి ఇద్దరూ సిద్దూతో వీడియో కాల్ మాట్లాడుతున్నట్లు చూపిస్తూ.. అక్టోబర్ 17న ఈ సినిమా విడుదల కానున్నట్లు సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు.
కాగా ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి యువరాజ్ సినిమాటోగ్రఫర్‌గా పనిచేస్తున్నాడు. జాతీయ అవార్డు గ్రహీత శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాధ్యతలు చేపట్టారు. మరి స్టైలిష్ట్‌గా పాపులర్ అయిన నీరజ కోన ఫిల్మ్ మేకర్ గా ఏ రేంజ్ లో ఆకట్టుకుంటుందో చూడాలి. పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టి.జి.విశ్వప్రసాద్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమా పై మంచి బజ్ ఉంది.
Two times the fun.
Two times the chaos.
And an infinite loop of love ❤️#TelusuKada – #LoveU2Bringing the celebration early this Diwali ????#TelusuKada Grand Release Worldwide on October 17th ✨
STAR BOY #SiddhuJonnalagadda @NeerajaKona #RaashiiKhanna @SrinidhiShetty7… pic.twitter.com/ucc18cIIIL
— People Media Factory (@peoplemediafcy) June 2, 2025


