ప్రస్తుతం మన సౌత్ సినిమా దగ్గర మంచి హైప్ ఉన్నటువంటి క్రేజీ సీక్వెల్ చిత్రాల్లో కోలీవుడ్ సినిమా “ఖైదీ 2” కూడా ఒకటి. కార్తీ హీరోగా దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో ప్లాన్ చేసిన మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో పార్ట్ 2 పై మరిన్ని అంచనాలు ఉన్నాయి. ఓ రకంగా తన సినిమాటిక్ యూనివర్స్ లో అన్ని సినిమాల కంటే దీనికే ఎక్కువ హైప్ ఉందని చెప్పినా కూడా ఆశ్చర్యం లేదు.
అలాగే ఎప్పుడో మొదలు కావాల్సిన ఈ సినిమా పలు కారణాలు చేత వెనక్కి వెళ్ళింది. ఇక ఇప్పుడు వస్తున్న కూలీ తర్వాత ఈ సినిమా ఉంటుంది అని లోకేష్ కనగరాజ్ కన్ఫర్మ్ చేసాడు. ఖైదీ 2 కోసం మొత్తం ముప్పై నుంచి ముప్పై ఐదు పేజీల ఇంట్రెస్టింగ్ స్క్రిప్ట్ డెవలప్ చేసానని ఖైదీ 2 చాలా బాగా వచ్చిందని తాను తెలిపాడు. ఈ కామెంట్స్ తో ఖైదీ ఫ్యాన్స్ మరింత ఎగ్జైట్ అవుతున్నారు.


