తనికెళ్ల భరణి, ఆకాష్ చేతుల మీదుగా ‘పెళ్లిలో పెళ్లి’ ఫస్ట్ లుక్ రిలీజ్

తనికెళ్ల భరణి, ఆకాష్ చేతుల మీదుగా ‘పెళ్లిలో పెళ్లి’ ఫస్ట్ లుక్ రిలీజ్

Published on Aug 8, 2025 7:03 AM IST

th

గౌరి ఫిలింస్‌తో కలిసి సుఖకర్త ఫిలింస్ ప్రొడక్షన్ నెం.1గా “పెళ్లిలో పెళ్లి” చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రంలో శివ సాయిరిషి, సంస్కృతి గోరే, విష్ణు ప్రియ, ఉమా మహేశ్వరరావు, తనికెళ్ల భరణి ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. గణేష్ కోలి నిర్మిస్తున్న “పెళ్లిలో పెళ్లి” సినిమాకు శ్రీకాంత్ సంబరం దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రెడీ అవుతోంది. ఇక ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్ లాంఛ్ తో పాటు బ్యానర్ లాంఛ్ కార్యక్రమాన్ని హైదరాబాద్ ప్రసాద్ ల్యాబ్స్ లో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నటుడు తనికెళ్ల భరణి, యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో నటుడు తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. ‘పెళ్లిలో పెళ్లి సినిమా ఈవెంట్ జరుగుతుంటే బయట కుండపోత వర్షం కురుస్తోంది. ఆ పరమేశ్వరుడు గంగ రూపంలో ఆశీర్వాదం పంపించాడు అనిపిస్తోంది. ఈ సినిమా బ్యానర్ పేరు సుఖకర్త..అంటే సుఖాన్ని అందించేవాడు అని అర్థం. దర్శకుడు శ్రీకాంత్ కొద్దిరోజుల క్రితం ఈ సినిమా కోసం అప్రోచ్ అయ్యాడు. షోలాపూర్ లో సినిమా చేస్తున్నామని చెప్పాడు. అక్కడ తెలుగు వాళ్లు చాలా మంది ఉంటారు. నన్ను ఈ టీమ్ ఎంతో గౌరవంగా చూసుకున్నారు. పెద్దలను గౌరవించడం అనే గొప్ప గుణం వీళ్లందరిలో కనిపించింది. గణేష్ కోలి లాంటి ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్ కు సక్సెస్ వస్తే మరిన్ని మంచి చిత్రాలు యంగ్ స్టర్స్ తో నిర్మిస్తారు. ఆయన “పెళ్లిలో పెళ్లి” సినిమాతో హిట్ అందుకుని బాలీవుడ్ లో సినిమాలు చేసేంతగా ఎదగాలని కోరుకుంటున్నా. డైరెక్టర్ శ్రీకాంత్ సంబరం ప్రతిభావంతుడు. హైదరాబాద్ లో సినిమా చేయడం సులువే కానీ షోలాపూర్ కు 24 క్రాఫ్టుల వాళ్లను తీసుకెళ్లి చాలా స్పీడ్ గా సినిమా రూపొందించాడు. అతనికి కూడా మంచి ఫ్యూచర్ ఉండాలని కోరుకుంటున్నా.’ అన్నారు.

యంగ్ హీరో ఆకాష్ జగన్నాథ్ మాట్లాడుతూ.. ‘ఇది పోస్టర్ లాంఛ్ లా లేదు ప్రీ రిలీజ్ ఈవెంట్ లా గ్రాండ్ గా చేశారు. ఈ సినిమా టీమ్ చూస్తుంటే అంతా యంగ్ స్టర్స్ ఉన్నారు. ఇలాంటి యంగ్ టీమ్ కు అవకాశం ఇచ్చి ఎంకరేజ్ చేస్తున్న ప్రొడ్యూసర్ గణేష్ కోలి గారికి, డైరెక్టర్ శ్రీకాంత్ గారికి నా అభినందనలు. ఈ సినిమాలో కీ రోల్ చేసి ఈ టీమ్ కు సపోర్ట్ గా ఉన్న భరణి గారికి కూడా థ్యాంక్స్. “పెళ్లిలో పెళ్లి” సినిమా టైటిల్ ఇంట్రెస్టింగ్ గా ఉంది. మూవీ ఫస్ట్ లుక్ పోస్టర్ కలర్ పుల్ గా ఇంప్రెస్ చేస్తోంది. సినిమా కూడా మంచి కంటెంట్ తో ఆకట్టుకుంటుందనే నమ్ముతున్నా. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్.’ అన్నారు.

నటి దివిజ మాట్లాడుతూ.. ‘పెళ్లిలో పెళ్లి సినిమాలో నటించే అవకాశం రావడం చాలా హ్యాపీగా ఉంది. ఈ సినిమా మా ప్రొడ్యూసర్ గణేష్ కోలి గారు లేకుంటే ఇంత గ్రాండ్ గా రెడీ అయ్యేది కాదు. ఈ టీమ్ తో కలిసి వర్క్ చేసిన ఎక్సీపిరియన్స్ మర్చిపోలేను. “పెళ్లిలో పెళ్లి” అనే మంచి మూవీతో మీ ముందుకు త్వరలోనే రాబోతున్నాం.’ అన్నారు.

ప్రొడ్యూసర్ గణేష్ కోలి మాట్లాడుతూ.. ‘సినిమా మేకింగ్ మీద అభిరుచితో “పెళ్లిలో పెళ్లి” చిత్రాన్ని ప్రొడ్యూస్ చేశాను. ఈ సినిమా రూపకల్పన బాధ్యత మొత్తం మా దర్శకుడు శ్రీకాంత్ చూసుకున్నారు. ఈ కథలో ట్విస్ట్ ఏంటనేది ఇంకా నాకు కూడా రివీల్ చేయలేదు. నేనూ మీతో పాటే థియేటర్స్ లో చూడబోతున్నా. ఈ టీమ్ అందరికీ మంచి పేరు రావాలి, గొప్ప స్థాయికి చేరుకోవాలని ఆశిస్తున్నా.’ అన్నారు.

డైరెక్టర్ శ్రీకాంత్ సంబరం మాట్లాడుతూ.. ‘మా ఈవెంట్ కు పిలవగానే వచ్చిన ఆకాష్ జగన్నాథ్ గారికి థ్యాంక్స్. ఆయనను ఇన్వైట్ చేసేప్పుడు నేను దేవుడిలా భావించే పూరి జగన్నాథ్ గారిని కలిశాను. షోలాపూర్ కు తెలుగు వాళ్లు వెళ్లి వందేళ్లవుతోంది. కానీ అక్కడి నుంచి ఒక తెలుగు సినిమాను చేసింది మాత్రమే మేమే. నేను గణేష్ మండపం దగ్గర ప్రొడ్యూసర్ గణేష్ కోలి గారిని కలిశాను. ఇప్పుడు పోస్టర్ లాంఛ్ ఈవెంట్ చూస్తుంటే ఆ వినాయకుడే మమ్మల్ని ఇక్కడిదాకా నడిపించాడని అనిపిస్తోంది. భరణి గారు మా మూవీలో కీ రోల్ చేశారు. ఈ చిత్రం మా అందరికీ ఒక ఎమోషనల్ జర్నీ. ఆ ఎమోషన్ ప్రేక్షకులకు కూడా రీచ్ అవుతుందని నమ్ముతున్నాం. ఎంఎల్ రాజా గారు ఇచ్చిన మ్యూజిక్ మా మూవీకి సోల్ లాంటిది. మాలాంటి కొత్త వాళ్లకు సపోర్ట్ ఇచ్చి నిలబెట్టాల్సింది మీరే.’ అన్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు