ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘శ్రీ చిదంబరం గారు’

ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసిన ‘శ్రీ చిదంబరం గారు’

Published on Feb 26, 2026 7:00 AM IST

Sri Chidambaram Garu

ఇటీవల తెలుగు సినిమా దగ్గర రిలీజ్ కి వచ్చిన కొన్ని చిన్న చిత్రాల్లో యువ దర్శకుడు వినయ్ రత్నం తెరకెక్కించిన విలేజ్ డ్రామా చిత్రం ‘శ్రీ చిదంబరం గారు’ కూడా ఒకటి. దాదాపు కొత్త నటీనటుల కలయికలో చేసిన ఈ చిత్రం సోషల్ మీడియాలో సినీ వర్గాల్లో కొంచెం హాట్ టాపిక్ గా మారింది. ఈ యువ దర్శకుడు జర్నీ, తన కథకి మలయాళ సినిమా నుంచి ఆఫర్లు రావడం తన స్ట్రగుల్స్ మళ్ళీ తెలుగుకే వచ్చి సినిమా చేయడం వంటివి బాగా వైరల్ అయ్యాయి.

మరి ఎట్టకేలకి ఈ సినిమా థియేటర్స్ నుంచి ఓటిటిలో స్ట్రీమింగ్ కి వచ్చేసింది. ఈ సినిమా హక్కులు మన తెలుగు స్ట్రీమింగ్ యాప్ ఈటీవీ విన్ వారు సొంతం చేసుకోగా అందులో ఈ చిత్రం నేటి నుంచి స్ట్రీమింగ్ కి వచ్చేసింది. సో అప్పుడు ఎవరైనా మిస్ అయ్యి ఉంటే ఈ చిత్రాన్ని ఇందులో చూడొచ్చు. ఇక ఈ సినిమాలో వంశీ తుమ్మల, సంధ్య వశిష్ట, గోపీనాథ్, శివకుమార్ మట్ట, కల్పలత, అరుణ్ కుమార్, తులసి తదితరులు నటించగా చింత వినీషా రెడ్డి, చింత గోపాల కృష్ణ రెడ్డిలు నిర్మాణం వహించారు.

సమీక్ష కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

సంబంధిత సమాచారం

తాజా వార్తలు