మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, అందాల భామ భాగ్యశ్రీ బొర్సె జంటగా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘కాంత’ ప్రేక్షకుల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ పీరియాడిక్ చిత్రంగా రూపొందిస్తున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్స్‌తోనే సినిమాపై మంచి బజ్ క్రియేట్ అయింది.
ఇక రీసెంట్‌గా ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేయగా దానికి సాలిడ్ రెస్పాన్స్ లభించింది. కాగా ఇప్పుడు ఈ సినిమా నుంచి మరో ట్రీట్‌ను మేకర్స్ రెడీ చేశారు. ఈ చిత్ర ఫస్ట్ సింగిల్ సాంగ్‌గా ‘పసిమనసే’ అనే పాటను రిలీజ్ చేస్తున్నట్లు వారు ప్రకటించారు. ఈ పాట పూర్తి రొమాంటిక్ సాంగ్‌గా ప్రేక్షకులను అలరించనుంది.
ఈ పాటలో దుల్కర్, భాగ్యశ్రీ ల మధ్య కెమిస్ట్రీ ప్రేక్షకులను ఇంప్రెస్ చేస్తుందని మేకర్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ పాటను ఆగస్టు 9న సాయంత్రం 4.30 గంటలకు రిలీజ్ చేస్తున్నారు. ఇక ఈ సినిమాను సెప్టెంబర్ 12న వరల్డ్‌వైడ్‌గా పాన్ ఇండియా భాషల్లో రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించారు.
Love blossoms on the silver screen! ❤ Check out ‘PASI MANASE’, the first song of #Kaanthafilm tomorrow at 4:30pm and watch @dulQuer and #Bhagyashriborse take center stage. ????????✨ Know their story on September 12, releasing worldwide.
A @SpiritMediaIN and @DQsWayfarerFilm… pic.twitter.com/2BxDiFcsXc
— Suresh Productions (@SureshProdns) August 8, 2025


