యూఎస్‌లో ‘కూలీ’ సెన్సేషన్.. అప్పుడే ఆ మార్క్ దాటేసిందిగా..!

యూఎస్‌లో ‘కూలీ’ సెన్సేషన్.. అప్పుడే ఆ మార్క్ దాటేసిందిగా..!

Published on Aug 8, 2025 8:06 PM IST

Coolie

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘కూలీ’ మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను దర్శకుడు లోకేష్ కనగరాజ్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు నెక్స్ట్ లెవెల్‌లో క్రియేట్ అయ్యాయి. అంతేగాక ఈ సినిమా ప్రమోషన్స్ కూడా వేరే లెవెల్‌లో ఉండటంతో ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరికొత్త రికార్డులు క్రియేట్ చేయడం ఖాయమని అభిమానులు అంటున్నారు.

ఈ సినిమా క్రేజ్ అమెరికాలోనూ సాలిడ్‌గా నెలకొంది. ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్‌లో దుమ్ములేపుతోంది. నార్త్ అమెరికాలో ఈ చిత్రం ఇప్పటికే ఏకంగా 1.5 మిలియన్ డాలర్ల వసూళ్లు రాబట్టినట్లు చిత్ర వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ సినిమా ఓపెనింగ్ రోజునే కళ్లుచెదిరే వసూళ్లు కొల్లగొట్టడం ఖాయంగా కనిపిస్తుంది.

ఉపేంద్ర, సత్యరాజ్, నాగార్జున, శ్రుతి హాసన్, అమీర్ ఖాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తున్నాడు. సన్ పిక్చర్స్ ప్రొడ్యూస్ చేసిన ఈ సినిమా ఆగస్టు 14న ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందా అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు.

సంబంధిత సమాచారం

తాజా వార్తలు